మొయిన్ ఖురేషీ కేసు నుంచి రాకేశ్ అస్థానాను తప్పించడం కుదరదు: ఢిల్లీ హైకోర్టు
- రాకేశ్ అస్థానా వేసిన పిటిషన్ కొట్టివేత
- ఈ కేసు దర్యాప్తు జరిపించాల్సిందే
- పది వారాల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశాలు
కాగా, అస్థానాపై క్రిమినల్ దర్యాప్తు చేపట్టకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను న్యాయస్థానం రద్దు చేసింది. ఈ కేసు విషయమై ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు కావడంతో అస్థానాను అరెస్టు చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, మొయిన్ ఖురేషీ కేసులో తనను తప్పించేందుకు ఓ మధ్యవర్తి ద్వారా రాకేశ్ అస్థానాకు తాను లంచం ఇచ్చిన విషయాన్ని హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త సతీశ్ బాబు బయటపెట్టడంతో ఈ విషయం వెలుగు చూసింది.