మాకు సంస్కారం, కల్చర్ వున్నాయి కాబట్టే ప్రతీ అడ్డమైన దానికి రియాక్ట్ అవ్వం!: బాలయ్యపై నాగబాబు ఫైర్
- విమర్శలపై ఎప్పుడైనా స్పందించవచ్చు
- ఒళ్లు మండి ఇప్పుడు మాట్లాడుతున్నాం
- ఆరో వీడియో విడుదల చేసిన నాగబాబు
విమర్శలు భరించి, భరించి, భరించి ఒళ్లు మండిపోయి ఇప్పుడు స్పందిస్తున్నామని నాగబాబు తెలిపారు. అయినా రియాక్ట్ కావడానికి అసలు టైమింగ్ ఏముందని ప్రశ్నించారు.‘‘మన ఇంట్లో దొంగతనం చేసి పారిపోయిన వ్యక్తి ఒక సంవత్సరం తర్వాత కనబడ్డాడు. పోనీలే ఏడాది అయిపోయింది కదా. వదిలేద్దాం’ అని అనుకుంటామా? మనను కొట్టి పారిపోయినవాడు సంవత్సరం తర్వాత కనిపిస్తే వదిలేస్తామా? పట్టుకుని కొడతాం’’ అని వ్యాఖ్యానించారు.