'భోగి' రోజున 'దేవ్' ఆడియో రిలీజ్
- కార్తీ .. రకుల్ జంటగా 'దేవ్'
- ఈ నెల 14న ఆడియో రిలీజ్
- వచ్చేనెల 14న సినిమా విడుదల
ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ కాన్సెప్ట్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని కార్తీ భావిస్తున్నాడు. గతంలో కార్తీ .. రకుల్ జంటగా నటించిన 'ఖాకీ' తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంది. మంచి వసూళ్లు రాబడుతూ ఇక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక 'దేవ్' కూడా అదే బాటలో దూసుకుపోతాడా? లేదా? అనేది చూడాలి.