'సారే జహాసె అచ్చా' పోస్టు చూసి, మీరెందుకు భుజాలు తడుముకుంటారు?: నాగబాబు మరో కౌంటర్
- పిల్లాడు చక్కగా పాడాడు, నచ్చింది
- వ్యక్తిగతంగా మిమ్మల్ని అనలేదే
- గుమ్మడికాయల దొంగంటే మీరెందుకు భుజాలు తడుముకుంటారు?
- తాజా వీడియోలో నాగబాబు
గత కొన్ని రోజులుగా ఆయన తన సోషల్ మీడియాలో వరుసగా వీడియోలు పెడుతూ, నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాలకృష్ణ మాట్లాడుతూ, 'సారే జహాసె అచ్చా'ను గుర్తు చేస్తూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కాగా, ఆయన్ను మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేశారు కూడా. ఇదే సమయంలో నాగబాబు తన ఫేస్ బుక్ లో ఈ పోస్ట్ పెట్టడంతో అది తమ హీరోను టార్గెట్ చేస్తూనేనని ఫ్యాన్స్ ఫిక్సయ్యారు. దీంతో సోషల్ మీడియాలో నందమూరి, మెగా ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈ నేపథ్యంలో నాగబాబు మరోమారు వీడియోను విడుదల చేస్తూ, ఫేస్ బుక్ పోస్టుపై వివరణ ఇచ్చారు.