థియేటర్స్ లోనే 'కథానాయకుడు' చూడమంటోన్న బాలకృష్ణ
- రేపే థియేటర్లకు 'కథానాయకుడు'
- ఆత్రుతను కనబరుస్తోన్న అభిమానులు
- పైరసీని అరికట్టమంటోన్న బాలయ్య
నందమూరి అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ పోషించిన వివిధ పాత్రల్లో బాలకృష్ణ ఎలా కనిపించనున్నారు? రకరకాల గెటప్పులతో ఆయన ఎలా మెప్పించనున్నారు? అనేది తెలుసుకోవడానికి ఆసక్తిని చూపుతున్నారు. ఆయా పాత్రల్లో విద్యాబాలన్ .. రకుల్ .. నిత్యామీనన్ .. హన్సిక .. రానా .. సుమంత్ .. కల్యాణ్ రామ్ ఎలా ఒదిగిపోయారనేది చూడటానికి ఆత్రుతను కనబరుస్తున్నారు.