'యాత్ర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా జగన్
- రాజశేఖర్ రెడ్డిగా మమ్ముట్టి
- విజయమ్మగా ఆశ్రిత వేముగంటి
- ఫిబ్రవరి 8న సినిమా విడుదల
ఈ వేడుకకి వైఎస్ జగన్ చీఫ్ గెస్ట్ గా రానున్నట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్ తో పాటు ఆయన తల్లి .. భార్య ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకకి హాజరు కానున్నట్టుగా సమాచారం. గతంలో వైఎస్ చేపట్టిన పాదయాత్ర .. ప్రజల మనసులకు ఆయన మరింత దగ్గరైన సంఘటనలు .. ఆనాటి రాజకీయాలపై ఆయన పాదయాత్ర చూపిన ప్రభావం ఈ బయోపిక్ లో ఆవిష్కరించనున్నారు. వైఎస్ గా మమ్ముట్టి .. విజయమ్మగా ఆశ్రిత వేముగంటి నటించిన ఈ బయోపిక్ కి అంచలంచెలుగా అంచనాలు పెరుగుతుండటం విశేషం.