మూడేళ్ల చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య
- వేళాంగిణి మాత దర్శనం
- ఆలయం వసతి గృహంలో మరో కూతురు మృతి
- సీసీ టీవీ ఫుటేజ్‌ల పరిశీలన
వీరంతా తమిళనాడులోని వేళాంగిణి మాత దర్శనం చేసుకున్నాక, విజయవాడకు వచ్చి, ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోపక్క, జయంతి పెద్ద కూతురు మహాలక్ష్మి వేళాంగిణి మాత ఆలయ ప్రాంగణంలోని వసతి గృహంలో మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై జీఆర్పీ పోలీసులు, విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ వచ్చాక వాళ్లు ఎక్కడెక్కడికి వెళ్లారు? ఏం చేశారనే వివరాల కోసం సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.