మళ్లీ మెగా ఫోన్ పడుతోన్న పోసాని
- రచయితగా పోసానికి మంచిపేరు
- దర్శకుడిగా వైవిధ్యభరిత చిత్రాలు
- నటుడిగా విలక్షణ పాత్రలు
ఇక ఆయన దర్శకత్వం జోలికి వెళ్లనట్టేనని అంతా అనుకున్నారు. కానీ ఆయన త్వరలో మెగాఫోన్ పట్టే ప్రయత్నంలో ఉన్నాడనేది తాజా సమాచారం. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాల ఆధారంగా ఆయన ఒక కథను సిద్ధం చేసుకున్నాడట. ఈ కథను సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసి, మే నెలలో విడుదల చేయాలనే ఆలోచనలో ఆయన వున్నాడని అంటున్నారు. ఏపీలో ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ సినిమాను రూపొందిస్తున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.