యాత్ర నుంచి లిరికల్ వీడియో సాంగ్
- వైఎస్ బయోపిక్ గా 'యాత్ర'
- వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన పాట
- ఫిబ్రవరి 8న సినిమా విడుదల
"ఊర్లే యేరెల్లే మారి హోరు హోరున ఉప్పొంగెరో .. దార్లే తారంగవాడి సేతులెత్తి జై కొట్టెరో .. "అంటూ ఈ సాంగ్ సాగుతోంది. వైఎస్ పాత్రలో మమ్ముట్టి గ్రామ గ్రామాన పాదయాత్రలు చేస్తూ .. అక్కడి ప్రజల కష్టనష్టాలను తెలుసుకునే దృశ్యాలతో ఈ సాంగ్ కొనసాగింది. కె .. సంగీతాన్ని అందించగా సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని సమకూర్చారు. వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన ఈ గీతం మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా వుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేయనున్నారు.