తండ్రీ కొడుకుల నేపథ్యంలో సాగే త్రివిక్రమ్ మూవీ
- ఎమోషన్ ప్రధానంగా సాగే త్రివిక్రమ్ మూవీ
- బన్నీ అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి
- కొత్త కోణంలో తండ్రీ కొడుకుల కథ
ఈ సినిమా కథ తండ్రీ కొడుకుల అనుబంధానికి సంబంధించినదిగా ఉంటుందనేది తాజా సమాచారం. గతంలో త్రివిక్రమ్ .. బన్నీ కాంబినేషన్లో వచ్చిన 'సన్నాఫ్ సత్యమూర్తి' ఒక రకంగా తండ్రీ కొడుకులకి సంబంధించినదే. అయితే ఈ సారి త్రివిక్రమ్ సిద్ధం చేసిన కథ కొత్త కోణంలో ఉంటుందని అంటున్నారు. మొత్తానికి త్రివిక్రమ్ ఈసారి కూడా తన కథలో యాక్షన్ .. కామెడీతో పాటు ఎమోషన్ కి ప్రాధాన్యతను ఇస్తున్నాడన్న మాట.