బుక్స్ చదవడమంటే నాకు చాలా ఇష్టం: రేణు దేశాయ్
- పుస్తకాలంటే నాకు ప్రాణం
- ప్రతిరోజు పుస్తకాలు చదువుతాను
- అందువల్లనే భాషపై పట్టు పెరిగింది
"చిన్నప్పటి నుంచి నాకు పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణం. పుస్తకాలు చదువుతూ వుండటం వలన మనకి తెలియకుండానే భాషపై పట్టు ఏర్పడుతుంది. ఏదైనా రాయాలనుకున్నప్పుడు పదాలను గురించి వెతుక్కోవలసిన అవసరం ఉండదు. ప్రతి రోజు ఏదో ఒక పుస్తకం చదువుతూనే వుంటాను. ఈ పేజీ తరువాత ఆపేద్దాం .. ఈ చాప్టర్ తరువాత ఆపేద్దాం అనుకుంటూనే తెల్లవారు జామువరకూ చదువుతూనే వుంటాను" అని చెప్పుకొచ్చారు.