బండ్ల గణేశ్ కు పీక కోసుకునేంత సీన్ లేదని మాకు ముందే తెలుసు: నాగబాబు
- గణేశ్ ఇంటర్వ్యూ చూడాలనిపిస్తుంది
- రియల్ లైఫ్‌లో కామెడీ చేస్తున్నాడు
- వంద అంటామండీ అని అంటాడని తెలుసు
మా పిల్లలం, మేమంతా టీఆర్ఎస్‌కి ఓటేశాం. గణేశ్ ఇంటర్వ్యూ నాకు చూడలనిపిస్తుంటుంది. ఎందుకంటే అతను బాగా నవ్విస్తాడు. గణేశ్ ఆ ఫన్‌ని సినిమాల్లో పెట్టుంటే చాలా పెద్ద కమెడియన్ అయ్యుండేవాడు. సినిమాల్లో చూపించకుండా రియల్ లైఫ్‌లో కామెడీ చూపిస్తున్నాడు. ఓడిపోతే ఏం చేస్తాడు? నిజంగా పీక కోసుకుంటాడా? అయితే గణేశ్ గాడికి పీక కోసుకునేంత సీన్ లేదని మాకు ముందే తెలుసు.
‘వంద అంటామండీ’ అని అంటాడని కూడా తెలుసు. చివరికి అదే అన్నాడు. ఎన్నికల సమయంలో ఓవైపు రేవంత్ రెడ్డి ఆవేశపూరిత ప్రసంగాలు.. మరోవైపు టీఆర్ఎస్ ప్రసంగాల మధ్య గణేశ్ గాడి మాటలు మాత్రమే ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండేవి. ఆ విషయంలో మాత్రం వాడిని మెచ్చుకోవాలి’’ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు.