జనవరి 1న 'జెర్సీ' నుంచి ఫస్టులుక్
- నాని కథానాయకుడిగా 'జెర్సీ'
- కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్
- సంగీత దర్శకుడిగా అనిరుధ్
జనవరి 1వ తేదీన అర్జున్ పాత్ర .. అందరినీ కలవనున్నట్టుగా ఒక పోస్టర్ బయటికి వచ్చింది. అంటే ఆ రోజున ఈ సినిమా నుంచి ఫస్టులుక్ రానున్నట్టుగా తెలుస్తోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాలో, నాని సరసన కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన పాత్రలకు ప్రాధాన్యతనిచ్చే నాని, ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.