కష్టాలు వచ్చినప్పుడు యుద్ధం చేయాలి .. నా సోదరులే నా ప్రాణం: నాగబాబు
- 'ఆరెంజ్'కి బడ్జెట్ పెరిగిపోయింది
- నష్టాలు చూసి షాక్ తిన్నాను
- నా సోదరులు అండగా నిలిచారు
అనుకున్న దానికంటే బడ్జెట్ పెరిగిపోవడమే ఇందుకు కారణమనే విషయం తెలుసుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో నా సోదరులు ఇద్దరూ నాకు సపోర్ట్ గా నిలిచారు. ఆ సమయంలోనే బుల్లితెరపై దృష్టి పెట్టాను. 'జబర్దస్త్' .. టీవీ సీరియల్స్ వలన పేరు డబ్బు వచ్చాయి. నాకు ఎదురైన సమస్యలు .. పాఠాలు నేర్పాయి. కష్టాలు ఎదురైనప్పుడు వెనకడుగు వేయకుండా యుద్ధం చేయాలనే విషయాన్ని చెప్పాయి. నాలో ఒక ధైర్యాన్ని నింపి .. నన్ను ఆదుకున్న నా సోదరులంటే నాకు ప్రాణం" అని నాగబాబు చెప్పుకొచ్చారు.