చిన్నారి ఉంటే... ఒంటరి పురుషుడికి ఏడాది పాటు వేతనంతో కూడిన సెలవు!
- తొలి 365 రోజులూ పూర్తి వేతనం
- ఆపై 730 రోజుల పాటు సగం వేతనం
- నోటిఫికేషన్ జారీ చేసిన కార్మిక మంత్రిత్వ శాఖ
ఆపై కూడా సెలవు కావాలని భావిస్తే, తదుపరి 730 రోజులకూ సగం వేతనం లభిస్తుంది. 7వ వేతన సంఘం చేసిన సిఫార్సుల మేరకు కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ వెలువరించింది. ఇప్పటివరకూ ఈ సౌలభ్యం స్త్రీలకు మాత్రమే అందుబాటులో ఉందన్న సంగతి తెలిసిందే.