షూటింగులో అమ్మ కళ్ల ముందే బైక్ పై నుంచి పడిపోయాను: నరేశ్
- అది 'రెండు కుటుంబాల కథ' షూటింగ్
- బైక్ తో జంప్ చేశాను
- రెండవసారి ప్రమాదానికి గురయ్యాను
ఈసారి బైక్ గాల్లో ఉండగానే నేను దానిపై నుంచి కింద పడిపోయాను. నేరుగా ముఖం నేలకి తగిలింది. దాంతో నేను స్పృహ కోల్పోయాను. ఆ తరువాత మెలకువ వచ్చేసరికి నేను కార్లో వున్నాను. నా ఒళ్లంతా రక్తం .. ట్రాఫిక్ క్లియర్ చేయమని మా అమ్మ రోడ్డుపై పరిగెడుతోంది. నేను బాగానే వున్నానని అమ్మకి చెప్పండి .. అని చెప్పేసి మళ్లీ సృహ కోల్పోయాను. ఆ తరువాత హాస్పిటల్లో మనలోకి వచ్చాను. ఆ ప్రమాదం కారణంగా 3 నెలలపాటు హాస్పిటల్లోనే వున్నాను" అని చెప్పుకొచ్చారు.