అలీ విషయంలో నేను చెప్పినట్టుగానే జరిగింది: సీనియర్ నరేశ్
- అలీ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు
- చైల్డ్ ఆర్టిస్ట్ గా గొప్ప కామెడీ చేశాడు
- అలాంటి చైల్డ్ ఆర్టిస్ట్ మళ్లీ రాలేదు
"అలీ .. నేను ఎన్నో సినిమాలు కలిసి చేశాము. దాదాపు ఓ పాతిక సినిమాలు చేసి ఉంటాము. చిన్నప్పటి నుంచి కూడా అలీ ఇదే సమయస్ఫూర్తిని కలిగి ఉండేవాడు. తాను మెహమూద్ అంతటి ఆర్టిస్ట్ ను అవుతానని అప్పట్లోనే అనేవాడు .. అన్నట్టుగానే అయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా అలీ మాదిరిగా కామెడీ చేసిన ఆర్టిస్ట్ ను నేను మళ్లీ చూడలేదు.. అలాంటి ఆర్టిస్ట్ రాడు కూడా. కమెడియన్ గా అలీ చేసినన్ని విభిన్నమైన పాత్రలు ఎవరూ చేసి వుండరు. అల్లు రామలింగయ్య గారి తరువాత అంతటివాడవు అవుతావని అప్పట్లోనే నేను చెప్పాను .. అలాగే అయ్యాడు" అంటూ ఆయన చెప్పుకొచ్చారు.