ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ తన మంచి మనసును చాటుకుంది. ఈసారి క్రిస్మస్ వేడుకలను ఐశ్వర్య ముంబైలోని ఓ కేన్సర్ ఆసుపత్రిలో చిన్నారులతో కలిసి జరుపుకుంది. కేన్సర్ తో బాధపడుతున్న చిన్నారులకు బహుమతులను అందించిన ఐష్, వారితో కలిసి పాటలకు స్టెప్పులేసింది. ఈ సందర్భంగా చిన్నారులంతా ఐశ్వర్యారాయ్ తో కలిసి ఫొటోలు దిగారు. కాగా, ఐశ్వర్యారాయ్ చిన్నారులతో కలిసి దిగిన ఫొటోలు వైరల్ గా మారాయి.