జగన్ ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొన్న సినీ నటుడు భానుచందర్!
- పాదయాత్రకు సంఘీభావం తెలిపిన నటుడు
- నేడు పాతపట్నం నియోజకవర్గంలోకి ప్రవేశం
- 329వ రోజుకు చేరుకున్న పాదయాత్ర
పాదయాత్రలో భాగంగా ప్రముఖ సినీ నటుడు భానుచందర్ జగన్ ను కలుసుకున్నారు. టెక్కలిలో జగన్ పాదయాత్ర మొదలైన వెంటనే జగన్ తో చేతులు కలిపి కొద్దిదూరం పాటు ఆయనతో కలిసి అడుగులో అడుగు వేశారు. ఈ సందర్భంగా భానుచందర్ మాట్లాడుతూ.. జగన్ ప్రజాసంకల్ప యాత్రకు సంఘీభావం తెలిపేందుకే తాను వచ్చానని చెప్పారు. జగన్ అంటే తనకు చాలా అభిమానమని వ్యాఖ్యానించారు.