తెలుగులోకి ప్రియా వారియర్ చిత్రం .. రిలీజ్ డేట్ ఖరారు
- మలయాళంలో 'ఒరు ఆదార్ లవ్'
- తెలుగు టైటిల్ గా 'లవర్స్ డే'
- ఫిబ్రవరి 14వ తేదీన విడుదల
గురురాజ్ .. వినోద్ రెడ్డి ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. తాజాగా వాళ్లు మాట్లాడుతూ .. "గట్టి పోటీని ఎదుర్కొని ఈ సినిమా తెలుగు హక్కులను మేము దక్కించుకున్నాము. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా, ఫిబ్రవరి 14వ తేదీన 'లవర్స్ డే' అనే టైటిల్ తో ఈ సినిమాను విడుదల చేయనున్నాము. ఇంతటి క్రేజీ ప్రాజెక్టును ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా వుంది" అని చెప్పుకొచ్చారు.