క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో విజయ్ దేవరకొండ
- తెలుగులో వరుస సినిమాలు
- 'నోటా'తో కోలీవుడ్ కి పరిచయం
- '1983'తో బాలీవుడ్ ఎంట్రీ
1983లో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో ఇండియా తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో హిందీలో '1983' టైటిల్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్ర కోసం ఆల్రెడీ రణ్ వీర్ సింగ్ ను ఎంపిక చేసుకున్నారు. ఇక అప్పటి మ్యాచ్ విజయంలో కీలకమైన పాత్రను పోషించిన కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర కోసం విజయ్ దేవరకొండను తీసుకున్నారనేది తాజా సమాచారం. మొత్తానికి విజయ్ దేవరకొండ దూకుడు ఒక రేంజ్ లోనే వుంది.