'కాంచన 3' విడుదల తేదీని ఖరారు చేసిన లారెన్స్
- లారెన్స్ నుంచి 'కాంచన 3'
- నాయికలుగా ఓవియా .. వేదిక
- ఏప్రిల్ 18వ తేదీన విడుదల
సన్ పిక్చర్స్ వారితో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాలో లారెన్స్ సరసన కథనాయికలుగా ఓవియా .. వేదిక నటిస్తున్నారు. ఏప్రిల్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రజనీకాంత్ 'పెట్టా' సినిమా ఇంటర్వెల్ సమయంలో 'కాంచన 3' మోషన్ పోస్టర్ ప్రదర్శితమయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి లారెన్స్ మరోమారు భయపెట్టడానికి రెడీ అవుతున్నాడన్న మాట.