ఆసక్తిని పెంచుతోన్న 'ఇదం జగత్' ట్రైలర్
- సుమంత్ హీరోగా 'ఇదం జగత్'
- కథానాయికగా అంజు కురియన్
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 'ఒక రిపోర్టర్ సైలెంట్ గా ఉన్నాడంటే దాని అర్థం .. వాడు మనకి దగ్గరగా వచ్చేశాడని' అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలవుతోంది. యాక్షన్ .. ఎమోషన్ .. సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. సినిమాపై ఆసక్తిని పెంచేదిగానే ఈ ట్రైలర్ వుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో సుమంత్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.