రాజ రాజ చోళుడి కథతో క్రిష్ వెబ్ సిరీస్
- దర్శకుడిగా క్రిష్ ఫుల్ బిజీ
- నిర్మాతగాను చురుకైన పాత్ర
- తమిళ వెబ్ సిరీస్ కి సన్నాహాలు
తాజాగా ఆయన ఒక నిర్మాతగా వెబ్ సిరీస్ లపై కూడా దృష్టిపెట్టారు. వెబ్ సిరీస్ కి కూడా ఆయన చారిత్రక కథావస్తువునే ఎంచుకోవడం విశేషం. 'రాజ రాజ చోళుడు' జీవిత చరిత్రను తమిళంలో వెబ్ సిరీస్ గా నిర్మించడానికి ఆయన రంగాన్ని సిద్ధం చేశారు. క్రిష్ సూపర్ విజన్ లో ఈ వెబ్ సిరీస్ కి సురేశ్ కృష్ణ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. గతంలో 'ప్రేమ'.. 'ఇంద్రుడు చంద్రుడు' .. 'బాషా' .. 'మాస్టర్' వంటి హిట్స్ సురేశ్ కృష్ణ ఖాతాలో వున్నాయి. ఆరు భాగాలుగా రానున్న ఈ తమిళ వెబ్ సిరీస్ .. తెలుగులోను అనువాదం కానుంది.