సంక్రాంతికి రజనీ సినిమా రానట్టే!
- సంక్రాంతికి గట్టిపోటీ
- బరిలోకి మూడు సినిమాలు
- తమిళంలో మాత్రం 'పెట్టా' రిలీజ్
తెలుగులో బాలకృష్ణ 'కథానాయకుడు' .. చరణ్ 'వినయ విధేయ రామ' .. వెంకటేశ్ 'ఎఫ్ 2' సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి. ఈ మూడు సినిమాలు కూడా భారీ స్థాయిలోనే విడుదలవుతున్నాయి. అందువలన 'పెట్టా' సినిమాకి థియేటర్ల సమస్య ఏర్పడే అవకాశం వుంది. అంతేకాదు వసూళ్లపై కూడా ప్రభావం చూపే ఛాన్స్ వుంది.
అందువలన తెలుగులో కొంత గ్యాప్ తీసుకుని 'పెట్టా'ను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారని సమాచారం. తెలుగులో గట్టిపోటీ కూడా ఉండటం వలన సంక్రాంతి బరి నుంచి 'పెట్టా' తప్పుకుందన్న మాట.