సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- షూటింగులో ఏడ్చేసిన సాయిపల్లవి!
- ప్రముఖ నిర్మాత చేతిలో రజనీకాంత్ సినిమా
- 'పడి పడి లేచె మనసు' నిడివి ఎక్కువేనట!
* తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం 'పెట్టా' తెలుగు వెర్షన్ హక్కులను ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ సొంతం చేసుకున్నారు. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిమ్రన్, త్రిష హీరోయిన్లుగా నటించారు.
* శర్వానంద్, సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన 'పడిపడి లేచె మనసు' చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. కాగా, ఈ చిత్రం రన్ టైం (నిడివి) 2 గంటల 39 నిమిషాలు వుందట. ప్రేమకథా చిత్రానికి ఇంత నిడివి కాస్త ఎక్కువనే చెప్పాలి.