ఎన్టీఆర్ కుమార్తెల చేతుల మీదుగా 'కథానాయకుడు' ట్రైలర్ లాంచ్!
- ఈ నెల 21వ తేదీన ఆడియో వేడుక
- ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు
- సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఎన్టీఆర్ కుమారులు .. కోడళ్లు .. కూతుళ్లు .. అల్లుళ్లు .. మనవళ్లు .. మనవరాళ్లు ఇలా అంతా కూడా ఈ వేడుకకి హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది. ఈ వేదికపై ఆ రోజున ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ నలుగురు కుమార్తెల చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను లాంచ్ చేయించనున్నట్టు సమాచారం. ఈ వేడుకను వీక్షించేందుకు నందమూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా 'కథానాయకుడు' ప్రేక్షకుల ముందుకు రానుంది.