'టాక్సీవాలా' జర్నీ ముగిసింది .. భారీ షేర్ సాధించింది
- 'అర్జున్ రెడ్డి' తరువాత స్థానంలో 'టాక్సీవాలా'
- నైజామ్ ఏరియాలో 7.70 కోట్ల షేర్
- ఓవర్సీస్ లో 3 కోట్ల షేర్
వసూళ్ల పరంగా 'గీత గోవిందం' .. 'అర్జున్ రెడ్డి' సినిమాల తరువాత స్థానంలో నిలిచింది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమా, అన్ని ప్రాంతాలలోను బాక్సాఫీస్ రన్ పూర్తిచేసుకుంది. ఓవరాల్ గా 21.28 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను వసూలు చేసింది. ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా 7.70 కోట్ల షేర్ ను సాధించగా .. ఓవర్సీస్ లో 3 కోట్ల షేర్ ను రాబట్టింది. అలా ఈ సినిమాను కొనుగోలు చేసిన వాళ్లందరికీ మంచి లాభాలను తెచ్చిపెట్టింది.