'118' నుంచి ఫస్టు టీజర్ వచ్చేస్తోంది
- గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్
- కథానాయికలుగా నివేదా థామస్ .. షాలిని పాండే
- ఫిబ్రవరి 19వ తేదీన విడుదల
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకి ఫస్టు టీజర్ ను వదలడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియపరుస్తూ స్పెషల్ పోస్టర్ ను వదిలారు. టీజర్ తోనే ఈ సినిమాపై అంచనాలు పెంచేలా ప్లాన్ చేసుకున్నారు. కొంతకాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తోన్న కల్యాణ్ రామ్, ఈ సినిమాతో హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.