ప్రియా వారియర్ బాలీవుడ్ సినిమా ‘శ్రీదేవి బంగ్లా’
- బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ప్రియా
- ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వం
- రూ.70కోట్లతో తెరెకెక్కనున్న చిత్రం
ప్రియా వారియర్ నటిస్తున్న తొలి చిత్రానికి ‘శ్రీదేవి బంగ్లా’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసినట్టు సమాచారం. దాదాపు రూ.70 కోట్లతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘భగవాన్’ చిత్రం ఫేమ్ ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది.