ఈశా పెళ్లిలో భోజనాలు ఎందుకు వడ్డించాల్సి వచ్చిందో వెల్లడించిన అభిషేక్ బచ్చన్
- భోజనాలు వడ్డించిన అమితాబ్, అభిషేక్, ఐష్
- నెట్టింట్లో వైరల్ అయిన ఫోటోలు, వీడియో
- ప్రశ్నల వర్షం కురిపించిన నెటిజన్లు
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. అంత మంది సేవకులుండగా సెలబ్రిటీలు వడ్డించడమేంటని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అభిషేక్ ఈ విషయమై ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ఇలా భోజనాలు వడ్డించే సంప్రదాయాన్ని ‘సజ్జన్ ఘోట్’ అంటారు. వధువు తరఫు కుటుంబీకులు వరుడి తరఫు వారికి భోజనాలు వడ్డిస్తారు’ అని సమాధానమిచ్చారు.