'యాత్ర' రిలీజ్ డేట్ ఖరారు .. మూడు భాషల్లో విడుదల
- మహి వి.రాఘవ దర్శకత్వంలో 'యాత్ర'
- వైఎస్ అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి
- ఫిబ్రవరి 8వ తేదీన భారీస్థాయి విడుదల
అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆయన చేపట్టిన పాదయాత్ర ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసి .. ఆయన విజయంలో కీలకమైన పాత్రను పోషించింది. ఆ విశేషాలన్నీ కూడా ఈ బయోపిక్ లో చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజల్లో వైఎస్ పట్లగల ఆదరాభిమానాల కారణంగా, ఈ సినిమాకి విశేషమైన స్పందన లభించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.