కొంచెం లవ్ .. మరికొంచెం ఎమోషన్ .. 'పడిపడి లేచె మనసు' ట్రైలర్
- సూర్య పాత్రలో శర్వానంద్
- వైశాలిగా సాయిపల్లవి
- లవ్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే కథ
"ఒక మనిషి గురించి జీవితంలో ఇంతగా తాపత్రయపడటం కరెక్ట్ కాదేమో .. సూర్య అనేవాడు ఇక నా జీవితంలో లేడుగాక లేడు" అంటూ వైశాలిగా సాయిపల్లవి డైలాగ్ తో ట్రైలర్ కొనసాగుతుంది. ఈ ఇద్దరి డైలాగ్స్ ఆ తరువాత ఏం జరగనుందనే ఆసక్తిని పెంచుతున్నాయి. లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతుందనిపిస్తోంది.