'ఎఫ్ 2' టీజర్ పై స్పందించిన మహేశ్ బాబు
- వెంకటేశ్ గారి కామెడీ బాగుంది
- టీమ్ కి ఆల్ ది బెస్ట్
- వెంకటేశ్ కి జన్మదిన శుభాకాంక్షలు
"ఈ సినిమా టీజర్ నేను చూశాను. ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ చాలా బాగున్నాయి. భయపడుతున్నట్టుగా వెంకీ చేసిన కామెడీ బాగుంది" అంటూ ఆయన ఈ సినిమా టీమ్ కి బెస్ట్ విషెష్ తెలియజేశాడు. ఇక ఈ రోజున వెంకటేశ్ పుట్టినరోజు కావడం వలన ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. మహేశ్ బాబు నుంచే ప్రశంసలు వచ్చాయంటే, తొలి టీజర్ తోనే అంచనాలు పెంచేయాలనే అనిల్ రావిపూడి ప్రయత్నం ఫలించిందని చెప్పాలి. తమన్నా .. మెహ్రీన్ కథానాయికలుగా సందడి చేసిన ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.