నిమ్మకూరులో ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక
- ఈ నెల 16వ తేదీన ట్రైలర్ విడుదల
- 21వ తేదీన ఆడియో వేడుక
- జనవరి 9వ తేదీన భారీ విడుదల
ఈ విషయమై స్పష్టమైన ప్రకటన చేస్తూ స్పెషల్ గా ఈ సినిమా టీమ్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రానా .. సుమంత్ .. విద్యాబాలన్ .. రకుల్ .. నిత్యామీనన్ .. హన్సిక తదితరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఎన్నో ప్రత్యేకతలు .. మరెన్నో విశేషాల సమాహారంగా ఈ సినిమా వస్తుండటంతో, అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.