'పెట్టా' టీజర్ రిలీజ్ .. డిఫరెంట్ లుక్స్ తో అదరగొట్టేస్తోన్న రజనీకాంత్
- ఈ రోజే రజనీ పుట్టిన రోజు
- 'పెట్టా' టీమ్ నుంచి శుభాకాంక్షలు
- సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
'పెట్టా' టీమ్ వారు రజనీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్లో రజనీ మోడ్రన్ గాను .. సంప్రదాయ దుస్తుల్లోను డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నారు. యూత్ తో కలిసి ఆయన స్టెప్పులు వేయడం .. అందరూ విందు చేస్తూ ఆయనను ఆశీర్వదించడం వంటి దృశ్యాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. ఆయన పుట్టినరోజు సందర్భానికి తగినట్టుగా వుండే టీజర్ నే సన్ పిక్చర్స్ వారు వదిలారన్న మాట. ఈ సినిమాలో సిమ్రాన్ .. త్రిష కథానాయికలుగా కనిపించనున్నారనే సంగతి తెలిసిందే.