రేపే రజనీ పుట్టినరోజు .. 'పెట్టా' టీజర్ రిలీజ్
- హిట్ టాక్ తెచ్చుకున్న '2.ఓ'
- 'పెట్టా'పై అభిమానుల్లో ఆసక్తి
- సంక్రాంతికి భారీ విడుదల
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ 'పెట్టా'మూవీ చేశారు. సిమ్రాన్ .. త్రిష కథానాయికలుగా చేసిన ఈ సినిమా, సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదల కానుంది. విభిన్నమైన కథాంశంతో .. ఆసక్తికరమైన కథనంతో నిర్మితమైన ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి. '2.ఓ' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న రజనీ అభిమానులు, 'పెట్టా' బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నారు.