బన్నీ స్క్రిప్ట్ పై త్రివిక్రమ్ కసరత్తు
- బన్నీకి కథ వినిపించిన త్రివిక్రమ్
- స్క్రిప్ట్ రెడీ కాగానే ప్రకటన
- హ్యాట్రిక్ హిట్ ఖాయమంటోన్న ఫ్యాన్స్
త్రివిక్రమ్ .. బన్నీ కోసం ఒక వైవిధ్యభరితమైన కథను తయారు చేసి రీసెంట్ గా స్క్రిప్ట్ వినిపించాడట. ఆ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు .. చేర్పులు బన్నీ చెప్పాడట. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తూ త్రివిక్రమ్ బిజీగా వున్నాడని అంటున్నారు. పూర్తి స్క్రిప్ట్ సిద్ధం కాగానే ఈ ప్రాజెక్టును గురించిన ప్రకటన చేయాలనే ఆలోచనలో వున్నారని అంటున్నారు. గతంలో త్రివిక్రమ్ .. బన్నీ కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అందువలన ఈ సారి ఈ కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో బన్నీ అభిమానులు వున్నారు.