బాలకృష్ణ కామెడీ ఆర్టిస్ట్.. ఆయన నాకు తెలియదని చెప్పడం తప్పే!: నాగబాబు సెటైర్
- బాలకృష్ణ మంచి నటుడు.. ఎన్టీఆర్, కృష్ణలతో కూడా నటించారు
- చాలా కాలం క్రితమే ఆయన మరణించారు
- బాలకృష్ణ తెలియని వారు ఎవరుంటారు?
ఈ సందర్భంగా ఆయన వల్లూరి బాలకృష్ణ ఫొటోను చూపించారు. ఈయనకు 'అంజిగాడు' అనే నిక్ నేమ్ కూడా ఉందని చెప్పారు. ఆయన మరణించి చాలా కాలమయిందని అన్నారు. ఎన్టీఆర్, కృష్ణలతో కలసి కూడా పని చేశారని చెప్పారు. ఆయనను మర్చిపోవడమనేది తాను చేసిన పెద్ద తప్పిదమని చెప్పారు. మరోవైపు, బాలయ్య ఎవరో తెలియదని నాగబాబు చేసిన వ్యాఖ్యలపై నందమూరి బాలకృష్ణ అభిమానులు మండిపడుతున్న సంగతి తెలిసిందే.