ఎన్టీఆర్ బయోపిక్ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది
- ఇటీవలే వచ్చిన ఫస్టు సింగిల్
- ఈ రోజు సాయంత్రం సెకండ్ సింగిల్
- సంగీత దర్శకుడిగా కీరవాణి
ఈ నేపథ్యంలో ఈ బయోపిక్ నుంచి రెండవ సింగిల్ ను వదలడానికి టీమ్ రెడీ అవుతోంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల 21 నిమిషాలకి 'రాజర్షి .. ' అంటూ సాగే సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని స్పెషల్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఎన్టీఆర్ గా బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ లోగోలో ఒకటైన 'నాగలి' బొమ్మను గోడపై గీస్తున్నట్టుగా ఈ పోస్టర్ పై కనిపిస్తున్నారు. కీరవాణి స్వరపరిచిన ఈ పాట ఏ స్థాయిలో దూసుకెళుతుందో చూడాలి మరి.