50వ సినిమా కోసం రంగంలోకి హన్సిక
- అందాల కథానాయికగా హన్సిక
- నటన పరంగాను మంచి మార్కులు
- సంగీత దర్శకుడిగా గిబ్రాన్
జమీల్ దర్శకుడిగా వ్యవహరించనున్న ఈ సినిమా షూటింగ్ ఈ రోజునే మొదలు కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. డిఫరెంట్ లుక్స్ తో హన్సిక కనిపిస్తుండగా .. వివిధ రకాల హావభావాలకి సంబంధించిన తన ఫేస్ మాస్కులే ఆమె చేతిలో కనిపిస్తున్నాయి. పోస్టర్ ను బట్టి కాన్సెప్ట్ విభిన్నంగా ఉంటుందనే విషయం అర్థమవుతోంది. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ కావొచ్చని అనిపిస్తోంది. గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. తెలుగులోను ఈ సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకువచ్చే ఆలోచనలో వున్నారు.