నందమూరి సుహాసినికి షాకిచ్చిన ఎన్టీఆర్.. తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వెళ్లకూడదని నిర్ణయం!
- ఇప్పటికే మద్దతు ప్రకటించిన యంగ్ టైగర్
- ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వస్తారని చెప్పిన సుహాసిని
- ఈసీకి సమాచారం ఇవ్వని మహాకూటమి నేతలు
ఇప్పటికే సుహాసినికి మద్దతుగా ఎన్టీఆర్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇంతకుమించి తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోరాదని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. సాధారణంగా ఎన్నికల ప్రచారానికి వచ్చే వ్యక్తుల వివరాలను ఈసీకి సమర్పించాల్సి ఉంటుందనీ, అయితే టీడీపీ, మహాకూటమి నేతలు ఇప్పటివరకూ ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించడంపై ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.