ముగింపు దశలో షకలక శంకర్ 'డ్రైవర్ రాముడు'
- షకలక శంకర్ హీరోగా 'డ్రైవర్ రాముడు'
- దర్శకుడిగా రాజ్ సత్య
- ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ పూర్తి
రంపచోడవరం .. మారేడుమిల్లి .. దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. అంచల్ సింగ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను తెచ్చిపెడుతుందనే నమ్మకంతో షకలక శంకర్ వున్నాడు. హీరోగా నిలదొక్కుకోవాలని షకలక శంకర్ ప్రయత్నం ఈ సినిమాతోనైనా ఫలిస్తుందేమో చూడాలి.