సీక్వెల్ దిశగా కార్తీ సెన్సేషనల్ మూవీ
- ప్రయోగాత్మక చిత్రంగా 'యుగానికి ఒక్కడు'
- చోళరాజుల నేపథ్యంలో సాగే కథ
- సీక్వెల్ చేసే ఆలోచనలో దర్శకుడు
సెల్వరాఘవన్ తెరకెక్కించిన చిత్రాలలో 'యుగానికి ఒక్కడు' ప్రత్యేకమైన స్థానంలో కనిపిస్తుంది. కార్తీ కెరియర్ ఆరంభంలో వచ్చిన సినిమా ఇది. అయినా ఒక ప్రయోగాత్మక చిత్రంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు కార్తీకి స్టార్ డమ్ వచ్చింది కనుక, ఆ సినిమాకి సీక్వెల్ చేస్తే మరింతగా ఆదరణ పొందుతుందనే నమ్మకంతో సెల్వరాఘవన్ వున్నాడట. చోళరాజుల నేపథ్యంలో సాగే కథను మరోమారు రూపొందించాలనే ఆసక్తి తనలో అలాగే ఉందంటూ ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. త్వరలోనే ఈ సీక్వెల్ పట్టాలెక్కనుందన్న మాట.