2 కోట్లు పలికిన ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో హక్కులు
- షూటింగు దశలో 'ఎన్టీఆర్' బయోపిక్
- తాజాగా హన్సిక .. పాయల్ ఎంపిక
- 'లహరి' సంస్థకు ఆడియో హక్కులు
ఈ సినిమా ఆడియో హక్కులను 'లహరి' సంస్థ సొంతం చేసుకుంది. ఇందుకుగాను ఆ సంస్థ 2 కోట్లు చెల్లించడం గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఆడియో అమ్మకాలు తగ్గిపోయి చాలాకాలమే అయింది. అయితే ఇటీవల ఆన్ లైన్ ఫ్లాట్ ఫారమ్ లకు విడివిడిగా రైట్స్ విక్రయించడం ద్వారా లాభాలు బాగానే వస్తున్నాయి. ఆడియో బాగుంటే ఆన్ లైన్ ఆదాయం బాగుండటంతో, 'లహరి' సంస్థ భారీ రేటుకు కొనుగోలు చేసిందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.