'మహర్షి'లో మెయిన్ విలన్ ఆయనేనట!
- విలేజ్ సెట్లో 'మహర్షి'
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
- ఏప్రిల్ 5వ తేదీన విడుదల
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో గతంలో వచ్చిన 'ఎవడు' సినిమాలో మెయిన్ విలన్ గా సాయికుమార్ అద్భుతంగా నటించాడు. ఆ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్ తో వంశీ పైడిపల్లి .. ఈ సినిమాలోను విలన్ గా సాయికుమార్ నే తీసుకున్నాడట. సాయికుమార్ కెరియర్లో ఇది చెప్పుకోదగిన పాత్ర అవుతుందని అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.