'పెట్టా' ఆడియో రిలీజ్ డేట్ ఖరారైపోయింది
- వచ్చేనెల 3వ తేదీన ఫస్టు సాంగ్
- 7వ తేదీన రెండవ పాట రిలీజ్
- సంక్రాంతికి సినిమా విడుదల
ఈ సినిమాకి అనిరుథ్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. డిసెంబర్ 3వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టు పాటను రిలీజ్ చేయనున్నారు. ఆ తరువాత 7వ తేదీన రెండవ పాటను వదలనున్నారు. 9వ తేదీన పూర్తి పాటలతో ఆడియోను రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. చాలా తక్కువ గ్యాప్ లో రజనీ నుంచి రెండు సినిమాలు వస్తుండటంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.