శర్వానంద్ .. సాయిపల్లవి నుంచి రొమాంటిక్ సాంగ్
- రొమాంటిక్ లవ్ స్టోరీతో హను రాఘవపూడి
- సంగీత దర్శకుడిగా విశాల్ చంద్రశేఖర్
- డిసెంబర్ 21వ తేదీన విడుదల
మంచుకొండల్లోని అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ పాట చాలా అందంగా.. హృద్యంగా వుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం .. శోభి కొరియోగ్రఫీ .. జేకే ఫోటోగ్రఫీ ఈ పాటకి ప్రాణం పోశాయి. ఈ పాట యూత్ కి కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. ప్రసాద్ - సుధాకర్ నిర్మించిన ఈ సినిమాలో, మురళీశర్మ .. సుహాసిని కీలకమైన పాత్రలను పోషించారు. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.