అసంతృప్తిని వ్యక్తం చేసిన విజయ్ దేవరకొండ .. 'డియర్ కామ్రేడ్' రీషూట్
- 'నోటా' పరాజయం ప్రభావం
- 'టాక్సీవాలా' విషయంలో టెన్షన్
- పక్కాగా ప్లాన్ చేసుకుంటున్న విజయ్
తనకి గల క్రేజ్ ను నిలబెట్టుకోవడం కోసమే ఆయన ఈ నిర్ణయానికి వచ్చాడు. అందులో భాగంగానే 'డియర్ కామ్రేడ్' సినిమాకి సంబంధించి ఇంతవరకూ వచ్చిన అవుట్ పుట్ చూసిన ఆయన, కొన్ని సీన్స్ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేశాడట. ఆయన సూచన మేరకు ఆ సీన్స్ రీ షూట్ పెట్టుకున్నారని తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ సినిమా వచ్చే వేసవిలో కాకుండా, దసరా తరువాత రావొచ్చని అంటున్నారు. ఆలస్యమైనా ఫరవాలేదు .. కంటెంట్ కరెక్టుగా ఉండాలనే ఉద్దేశంతోనే విజయ్ దేవరకొండ ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు.