అంజలి ప్రధాన పాత్రగా 'ఆనందభైరవి'
- విభిన్నమైన కంటెంట్ తో 'ఆనందభైరవి'
- జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్
- ప్రత్యేక పాత్రలో రాయ్ లక్ష్మీ
డిసెంబర్లో ఈ సినిమాను లాంచ్ చేసి, జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. కర్రి బాలాజీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కీలకంగా నిలవనున్నాయి. అందువలన అంజలి అందుకు సంబంధించి ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. హైదరాబాద్ .. వైజాగ్ .. కేరళ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ కొనసాగనుంది. ఇప్పటి వరకూ అంజలి చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఈ పాత్ర ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. అంజలి జోడీగా ఒక యువ హీరోను ఎంపిక చేయనున్నారు. ఒక కీలకమైన పాత్రలో రాయ్ లక్ష్మీ కనిపించనుంది.